|

Contact Telugudesam Party NTR Bhavan, Road No. 2
Banjara Hills, Hyderabad 500034
Andhra Pradesh, India
Ph.No: +91 40 30699999
+91 40 23542108

|
Press Statements by NRI TDP
|
పాలడుగు వెంకట్రావు ఫై ఎన్.ఆర్.ఐ. టి.డి.పి మిచిగాన్ కమిటీ ధ్వజం
అమెరికా లొని కొందరు తెలుగు వారు వ్యవహరిస్తున్న తీరుని తప్పు పడుతున్న శ్రీ పాలడుగు వెంకట్రావు గారి వ్యాఖ్యలను ఎన్నారై టిడిపి మిచిగాన్ స్టేట్ కమిటి తీవ్రంగా ఖండిస్తున్నది.
ప్రవాసాంధ్రుల మైన మేము మా అభిమాన తెలుగు దేశం పార్టీ అధినేతకి నైతిక మద్దతు గా, ఇక్కడ చెసిన కార్ రాలీ మీద తమరు చేసిన వ్యాఖ్యలు మీ స్థాయికి తగినట్లు లేకపోగా, చాలా హాస్యాస్పదంగా వున్నాయి. చంద్రబాబు గారి దార్శనికత వల్ల మాలాంటి కొన్ని లక్షల మంది ప్రవాసాంధ్రులం ఈ రొజు ఇక్కద అత్యున్నత స్థాయి లో స్తిరపడి వున్నాము, మా గుండెల నిండా మాత్రుదేశం పైన ప్రెమ వుంది.
పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనపడినట్లు మీకు ఎన్నారై అనగానే డాలర్స్ పండించే యంత్రాలుగా మాత్రమే కనపడుతరు. అందుకె డబ్బులు ఇవ్వండి చాలు, మిగతావి మేము చేస్తాము అంటున్నరు మీరు. చంద్రబాబు గారు ఇచ్చిన స్పూర్తితో ఇక్కడ మేము నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాలు, ఇండియా లో మెడికల్ కేంప్స్, అన్న గారి జన్మ దిన సందర్భంగా ఇక్కద 1700 మంది పేదవారికి ఆహారం ఇవ్వటం ఇవెమీ మీకు కనపడవు, కెవలం డబ్బులు పంపటమే కాదు, ఇంకా మాత్రుభూమికి చాల చేయాలి అన్న మా తపన మీకు ఎప్పటికీ అర్ధం కాదు.
ఇంకొకసారి గౌరవం గురించి మాట్లడేముందు మొన్న లోక్ సభ లో తమ పార్టీ డబ్బు సంచులతో చేసిన నిర్వాకం గుర్తు తెచ్చుకొండి చాలు. ఎక్కడినుండొ ఒక విదేశీయురాలిని తీసుకొని వచ్చి ఆమె పాదాల దగ్గర 125 సంవత్సరాల పార్టీని పెట్టి ప్రదక్షిణాలు చెస్తున్న మీతో, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని దిగ్దిగంతాలకు చాటి చెప్పిన పార్టీ లొ పుట్టిపెరిగిన మేము చెప్పించుకోవాలసిన అవసరం లేదు అని సవినయంగా మనవి చేస్తున్నాము.
ఇట్లు,
నాదెల్ల గంగాధర్, గొర్రెపాటి గొపిచంద్ (ఎన్నారై టిడిపి నేషనల్ కమిటీ) మెహర్ వెలగపూడి, బసవేంద్ర సూరపనేని, దంతేశ్వరరావు చల్లా, గోగినెని శ్రీనివాస్, సతీష్ మందలపు, మోహన్ కోనెరు (ఎన్నారై టిడిపి మి చిగన్ కమిటీ)డెట్రాయిట్
|
|
చన్నారెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకొండి - ఎన్నారై టిడిపి కమిటీ
తెలుగు దేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నాగం జనార్ధన్ రెడ్డి 'పాలు, బియ్యం వ్యాపారం చెసుకొవలసిందే నంటూ', శ్రీ చిన్నా రెడ్డి హేళనగా చేసిన వ్యాఖ్యలను ఎన్నారై టిడిపి కమిటీ సభ్యులు శ్రీ గంగాధర్ నాదెల్ల, శ్రీ శ్రీనివాస్ ఛందు గొర్రెపాటి, శ్రీ సూరపనేని బసవేంద్ర, శ్రీ మోహన్ కొనేరు ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తీవ్రం గా ఖండించారు.
మీ నాయకుడి మెప్పు పొందటానికి, రాష్ట్రాన్ని సుధీర్గంగా పరిపాలించి దేశ, విదేశాల్లొ ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇలా అవాకులు, చెవాకులు పేలడం సరికాదన్నారు. రాష్ట్ర గ్రామీణాభివ్రుద్ది శాఖ మంత్రి అయ్యివుండి లక్షలాది గ్రామీణ ప్రజలు తమ జీవనోపాది కొరకు రోజూ చేసె పాలు, బియ్యం వ్యాపారాం గురించి అధికార మదం తో చులకనగా మట్లాడటం, వాళ్ళని కించపరచడమే అన్నారు.
శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్షం లో వున్నప్పుడు జరిపిన పాదయాత్ర సందర్భంగా నల్ల జండాలతో నిరసన తెలిపి ఈ రొజు మంత్రి పదవి దొరకగానె అదే వ్యక్తిని ఇంద్రుడు, చంద్రుడు అంటూ అకాశానికి ఎత్తటం ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు, సరి అయిన సందర్భంలో బుద్ది చెపుతారు అని హెచ్చరించారు. |
|
|